Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ పాఠశాలలో బ్యూటీ, వెల్ నెస్ ల్యాబ్ ల ప్రారంభం

ఆదర్శ పాఠశాలలో బ్యూటీ, వెల్ నెస్ ల్యాబ్ ల ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల
గ్రామీణ ప్రాంత బాలికల ఆకర్షణీయమైన ఆకారానికి బ్యూటీ అండ్ వెల్ నెస్ ల్యాబు లు ఉపయోగపడతాయని మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ పేర్కొన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లలో భాగంగా దామరచర్ల మండలం లోని బొత్తల పాలెం ఆదర్శ పాఠశాల నందు బ్యూటీ , వెల్నెస్ హెల్త్ ల్యాబ్ లను మంగళవారం ప్రారంభించన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పరికరాలు అత్యాధునిక సౌకర్యాలతో ప్రత్యేక శిక్షణ పొందిన ఇన్స్ట్రక్టర్లచే కౌమారదశ బాలికలకు శారీరక వికాసాన్ని పెంపొందించే ల్యాబ్ గ్రామీణ ప్రాంత పాఠశాలలకు మంజూరు కావడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు బాలికల సమగ్ర అభివృద్ధి ఆకాంక్షించే ఆదర్శ పాఠశాలను ఆదరించాలని కోరారు. వృత్తి విద్య కోర్సులైన బ్యూటీ వెల్నెస్, ఆరోగ్య విద్య కోర్సులు బాలికల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరహరి ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ కవిత,దుర్గా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad