Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమాభావోద్వేగభరితంగా 'బ్యూటీ' టీజర్‌

భావోద్వేగభరితంగా ‘బ్యూటీ’ టీజర్‌

- Advertisement -

మంచి యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీకి, ఫాదర్‌ ఎమోషన్‌, మిడిల్‌ క్లాస్‌ టచ్‌ ఇస్తే ఎలా ఉం టుందో ‘బ్యూటీ’ సినిమా చూపించనుందని అంటున్నారు మేకర్స్‌.
అంకిత్‌ కొయ్య, నీలఖి జంటగా వానరా సెల్యూ లాయిడ్‌, మారుతీ టీం ప్రొడక్ట్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’.
‘గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్‌, భలే ఉన్నాడే’ ఫేమ్‌ జె.ఎస్‌.ఎస్‌.వర్ధన్‌ మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అడిదాల విజయపాల్‌ రెడ్డి, ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్‌.వి. సుబ్ర హ్మణ్యం అందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
‘ఆ బైక్‌ ఎంత ఉంటుం దంటావ్‌?.. మన కారు సంవ త్సరం ఈఎంఐ ఎంత ఉంటుం దో.. ఆ బైక్‌ అంత ఉంటుంది’ అనే డైలాగ్‌తో మిడిల్‌ క్లాస్‌ కలల్ని, కష్టాల్ని ఈ టీజర్‌లో చూపించారు. ‘కూతురు అడిగింది కొనిచ్చేప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను’ అంటూ టీజర్‌ చివర్లో వచ్చిన ఎమోషనల్‌ డైలాగ్‌ ఈ మూవీ కథ ఏంటో చెప్పేస్తుంది. ఇక ఈ ఎమోషనల్‌ టీజర్‌ ఆడియెన్స్‌ను కదిలించేలా ఉంది. విజరు బుల్గానిన్‌ ఆర్‌ఆర్‌ అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. శ్రీ సాయి కుమార్‌ దారా ఇచ్చిన విజువల్స్‌ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉన్నాయి’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad