Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅగ్ర నేతల రాకతో బీజింగ్‌ బిజీ బిజీ

అగ్ర నేతల రాకతో బీజింగ్‌ బిజీ బిజీ

- Advertisement -

ఎస్‌సీఓ సదస్సు,సైనిక పరేడ్‌కు సర్వం సిద్ధం
తైపీ :
ప్రపంచ దేశాలకు చెందిన సుమారు పాతిక మంది నేతలకు బీజింగ్‌ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే వారం అక్కడ రెండు ప్రధాన రక్షణ సంబంధమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. వీటిలో ఒకటి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వార్షిక సదస్సు. 2001లో చైనా, రష్యాలు దీనిని ఏర్పాటు చేశాయి. ఇక రెండో కార్యక్రమం…రెండో ప్రపంచ యుద్ధం ముగింపు 80వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించే సైనిక పెరేడ్‌. ఆ యుద్ధంలో పొరుగు దేశమైన జపాన్‌పై చైనా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలలో భాగస్వాములయ్యేందుకు రష్యా, ఉత్తర కొరియా నేతలతో పాటు ఆగేయాసియా, మధ్య ఆసియా ప్రాంతాలలోని పలు దేశాల అధినేతలు కూడా బీజింగ్‌కు తరలి వస్తున్నారు. ఆది, సోమ వారాలలో జరిగే ఎస్‌ఓసీ సదస్సుకు హాజరయ్యేందుకు పలువురు నేతలు ఇప్పటికే స్వదేశాల నుంచి బయలు దేరారు. బీజింగ్‌కు ఆగేయంగా ఉన్న తియంజిన్‌ నగరంలో ఈ సదస్సు జరుగుతుంది. బుధవారం నాడు బీజింగ్‌లో భారీ సైనిక పెరేడ్‌ జరగబోతోంది. చైనాలో దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక ఆయుధాల ప్రదర్శనకు ఇది వేదిక కాబోతోంది. వీటిలో వందకు పైగా యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులు ఉన్నాయి. ఎస్‌సీఓలోని పది సభ్య దేశాల నేతలతో పాటు మరో పాతిక దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. ఈ దేశాలలో కొన్ని త్వరలోనే ఎస్‌ఓసీ గ్రూపులో చేరబోతున్నాయి. చైనా, రష్యా, కజక్‌స్థాన్‌, కిర్గిస్థాన్‌, తజికిస్థాన్‌ దేశాలు ఎస్‌ఓసీని ఏర్పాటు చేయగా భారత్‌, ఇరాన్‌, పాకిస్తాన్‌, బెలారస్‌ దేశాలు ఆ తర్వాతి కాలంలో అందులో చేరాయి. ఆఫ్ఘనిస్తాన్‌, మంగోలియాలు పరిశీలక దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆగేయాసియా, మధ్య ఆసియాకు చెందిన మరో 14 దేశాలు ‘చర్చల భాగస్వాములు’గా వ్యవహరిస్తున్నాయి.

ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రముఖుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా, ఇరాన్‌ అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌, మసూద్‌ పెజెష్కియాన్‌ ఉన్నారు. చర్చల భాగస్వాములుగా కొనసాగుతున్న దేశాల నుంచి టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌, ఈజిప్ట్‌ ప్రధాని ముస్తాఫా మద్‌బౌలీ కూడా హాజరవుతున్నారు. ఎస్‌ఓసీలో సభ్యులు కాకపోయినా ఇండోనేషియా, లావోస్‌, మలేసియా, వియత్నాం దేశాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. కాగా సైనిక పెరేడ్‌కు ముందే భారత్‌, ఈజిప్ట్‌, టర్నీ దేశాల నేతలు బీజింగ్‌ నుంచి స్వదేశాలకు బయలుదేరతారు. ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మాత్రం సైనిక విన్యాసాలను వీక్షిస్తారు. మయన్మార్‌ జుంటా అధినేత, దేశ తాత్కాలిక అధ్యక్షుడు మిన్‌ అంగ్‌ హ్లాయింగ్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయిల్‌ దియాజ్‌-కానెల్‌తో పాటు డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, జింబాబ్వే నేతలు కూడా పెరేడ్‌కు హాజరవుతారు. వీరితో పాటు సెర్బియా అధ్యక్షుడు అలగ్జాండర్‌ వ్వూసిస్‌, స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో సైనిక విన్యాసాలను తిలకిస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad