– మహిళా సంఘాల సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించనున్న మహా గ్రౌండింగ్ మేళలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసుకునేలా లబ్ధిదారులను సిద్ధం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సమైక్యల కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మహా గ్రౌండింగ్ మేళాలో ఇండ్లకు ముగ్గులు పోయాల్సిన 44 మంది లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను ఐకేపీ మహిళా సంఘాల కార్యవర్గ సభ్యులకు అందజేశారు. జాబితాలో ఉన్న లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారు మహా గ్రౌండింగ్ మేళాలో తప్పనిసరిగా ముగ్గు పోసుకొనేలా చూడాల్సిన బాధ్యత మహిళా సంఘాల సభ్యులపై ఉందన్నారు. ఇందుకు మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక చొరవచూపి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులను కలిసి వివరించాలన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టడంలో లబ్ధిదారులకు ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలన్నారు.ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళా సంఘం ద్వారా రుణాలు అందిస్తామని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఐకేపీ ఏపిఎం కిరణ్ కుమార్, సీసీలు కుంట శ్రీనివాస్, వర్ణం శ్రీనివాస్, నవీన్, భాగ్యలక్ష్మి, పీరియా, అలేఖ్య, సిబ్బంది ధనలక్ష్మి, అనసూయ, సత్తన్న, మండల సమైక్య అధ్యక్షురాలు కమల, మహిళా సమాఖ్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గులు పోసుకునేలా లబ్ధిదారులను సిద్ధం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES