హైదరాబాద్ :ప్రముఖ డిస్ల్పే టెక్నాలజీ దిగ్గజం బెన్‌క్యూ తెలంగాణలో తన కార్యకలాపా లను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెన్‌క్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ స్మార్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 8,700కు పైగా డిజిటల్ తరగతి గదులను తమ సంస్థ విజయవంతంగా తీర్చిదిద్దిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్‌వేర్, సృజనాత్మక పరిశ్రమలు అభివృద్ధి చెందుతుం డటంతో ప్రొఫెషనల్ మానిటర్లు, హోమ్ థియేటర్ ప్రొజెక్టర్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు. డిజిటల్ తరగతి గదుల నుండి ప్రొఫెషనల్ క్రియేటర్ల వరకు అధిక నాణ్యత గల డిస్‌ప్లే పరిష్కారాల కోసం తెలంగాణలో అద్భుతమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణ లను రాష్ట్రానికి అందించడానికి తాము నిరంతరం కట్టుబడి ఉన్నామ న్నారు. తమ మొత్తం అమ్మకాల్లో తెలంగాణ వాటా 7 శాతంగా ఉంద న్నారు. రాష్ట్రంలో 250 పైగా భాగస్వాములను కలిగి ఉన్నామన్నారు. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.500 కోట్ల మేర ఆర్డర్లు ఉన్నాయన్నారు.
తెలంగాణ మార్కెట్‌పై బెన్‌క్యూ కీలక దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



