Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెస్ట్ అవైలబుల్  పథకం పెండింగ్ బకాయిలను చెల్లించాలి: ఎస్ఎఫ్ఐ

బెస్ట్ అవైలబుల్  పథకం పెండింగ్ బకాయిలను చెల్లించాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న  బెస్ట్ అవైలబుల్ స్కీమ్  పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తాళ్లగడ్డలో  విద్యార్థులతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థుల  భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 237 ప్రయివేట్ పాఠశాలల్లో 25 వేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించటం  లక్ష్యంగా తీసుకొచ్చిన పథకం  నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గత రెండు సంవత్సరాలుగా రూ.150 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అనేకమార్లు  విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలు  ప్రభుత్వానికి మొరపెట్టుకున్న  ప్రయోజనం లేదన్నారు.

ప్రతి పాఠశాలకు లక్షలల్లో బకాయిలు ఉండటంతో యాజమాన్యాలు అప్పులతో నడపలేమని  చేతులెత్తేసే దుస్థితి ఏర్పడిందన్నారు. యాజమాన్యాలు హాస్టల్ నిర్వాహణ, సిబ్బంది వేతనాలు, భవనాల అద్దెలు  చెల్లించకపోవడంతో సమస్య తీవ్రతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం, యాజమాన్యాలు పాఠశాలలను నడపలేమని చెప్పటంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందాన్నారు . విద్యార్థులు ఫీజులు చెల్లించలేక  పాఠశాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, గిరిజన సంక్షేమ ప్రభుత్వo అని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం  ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదన్నారు.  వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేసిన   దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వ తీరు ఉందన్నారు. బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా  బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈనెల 23న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ  ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. ఈ బంద్ తో  ప్రభుత్వం కళ్లు తెరిచి  విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని  లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పులుసు శ్రవణ్, శివ, వేణు, గోపి, దీపక్, అజయ్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -