– కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులు మీదుగా ప్రిన్సిపాల్ అనిత కు ప్రశంసాపత్రం
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు అల్లు అనిత కు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి,విద్యార్థులను కళాశాలకు రప్పించి కళాశాలలోని విద్యార్థుల హాజరు శాతాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లాలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట ను ప్రత్యేక స్థానంలో నిలిపి నందుకు కళాశాల లో మౌలిక వసతులు కల్పనలో ముఖ్య భూమిక పోషించినందుకు గాను జిల్లా బెస్ట్ ప్రిన్సిపాల్ గా సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డును ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అలాగే ఇదే కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఆర్.అరవింద్ బాబు, కళాశాలలో విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని సులభతరమైన పద్ధతిలో బోధించడం మే కాకుండా ఎంసెట్, జేఈఈ మెయిన్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, జిల్లా డి ఎ ఎమ్ వో గా డీఈసీ మెంబర్ గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికై జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతుల మీదుగా అవార్డును ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు,కార్యాలయ సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపాల్ అనిత, అరవింద్ బాబు లకు అభినందనలు తెలిపారు.



