No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్ : ప్రభుత్వ పాఠశాలలోని మెరుగైన విద్య అందిస్తుందని ప్రధానోపాధ్యాయులు మురళి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ బాలికల, బాలుర ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మురళి, ధర్మ ప్రకాష్, స్వర్ణలత, భాగ్యలక్ష్మిఆధ్వర్యంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు సమిష్టిగా ధర్మసాగర్ గ్రామ ప్రధాన వీధులలో బడిబాట ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాల ద్వారా, గుణాత్మక విద్య విద్యార్థులకు అందే విషయాన్ని ప్లే కార్డులతో చేసిన ప్రదర్శన గ్రామ ప్రజలను ఆకట్టుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లయితే మంచి విద్యను పిల్లలకు అందివ్వగలమనే హామీని ధర్మసాగర్ గ్రామ తల్లిదండ్రులకు ,సమాజానికి తెలపడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఉపాధ్యాయులు అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు దగ్గరలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad