Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే కుంభం

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన రాసాల కొమురయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని బోనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ సహాయ నిధి నుండి ఎల్ఓసి ద్వారా వారి వైద్యం కోసం రూ.3,50,000 (అక్షరాలామూడు లక్షల యాభై వేల రూపాయలను) అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. పేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, వారు కూడా మెరుగైన వైద్య సేవలు పొందాలని తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రిలో లాగా వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఎవరు కూడా ఇబ్బందులకు గురి కావద్దని అన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు మచ్చ పాండు, రాసాల నవీన్, రాసాల అలివేల పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad