నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో పల్లె దవాఖాన ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. ప్రతి రోజు ఆసుపత్రికి ఓపి లో ఎంత మంది వస్తున్నారని ఓ. పి రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు ఏ రోగాలతో వస్తున్నారని, అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయ అని తెలుసుకు న్నారు. సిబ్బంది అందరూ రోజు విధులకు హాజరవుతున్నారా అని అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. గత నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయని, ఎక్కడ అయ్యాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ నెలలో ఎన్ని ఈ డి డి లు ఉన్నాయని, పసి పిల్లలకు వ్యాక్సినేషన్ వేస్తున్నారా అని, ప్రతి నెల ఆ డేట్ ప్రకారం చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాలన్నారు. ఈ ఆసుపత్రిలో గత నెలలో రెండు డెలివరీ ఉంటే అవి ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగాయని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఈ నెల లో ఒక్క డెలివరీ డేట్ ఉందని వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుంటార అని కలెక్టర్ కు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, అవి ఎంత మేరకు నిర్మాణ పనులు పూర్తి అయ్యాని, అయినంత వరకు బిల్లులు వచ్చాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో స్లాబ్ లెవల్ వరకు పూర్తి అయిన ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు 3 దశలలో బిల్లులు వచ్చాయా అని కలెక్టర్ కు తెలిపారు. మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేసుకోని కొత్త ఇంటికి వెళ్ళాల అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES