న్యూయార్క్‌లో భారీగా నర్సులు సమ్మె
న్యూయార్క్ : మెరుగైన పని పరిస్జితులను కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నర్సులు న్యూయార్క్ నగరంలో సమ్మె బాట పట్టారు. అమెరికాలోని అతిపెద్దనగరమైన మౌంట్ సినారు, మాంటెఫియోర్, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్‌లోని మూడు ప్రయివేటు ఆస్పత్రుల్లోని దాదాపు 15వేల మంది నర్సులు సోమవారం తెల్లవారుజామున తమ విధుల్లోకి వెళ్లకుండా నిష్క్ర మించారు. నర్సులకు ఆరోగ్యసంరక్షణ ప్రయోజనాలు, మెరుగైన పని పరిస్థితులు, పని ప్రదేశాల్లో హింస నుంచి వారికి రక్షణ కల్పించుట, రోగులకు సురక్షితమైన సిబ్బంది నియామకంపై నెలల తరబడి ఆసుపత్రి యాజ మాన్యాలతో చర్చలు జరిపాము. అయినాప్పటికీ ఈ డిమాండ్లకు ఆస్పత్రి యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో సమ్మెకు పిలుపిచ్చినట్టు న్యూయార్క్ స్టేట్ నర్సింగ్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్ నగరంలోని అత్యంత ధనిక ఆసుపత్రుల మేనేజ్‌మెంట్.. నర్సుల ఆరోగ్య ప్రయో జనాలను నిలిపివేయడం లేదా, వాటికి కోత పెట్టడం చేస్తామని బెదిరిస్తున్నట్టు నర్సింగ్ గ్రూప్ వెల్లడించింది. కాగా, చాలా కాలంగా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఉన్న నర్సులపై అధిక పనిభారం పడుతోంది. ఇది కోవిడ్ పిరియడ్ నుంచే కొనసాగుతుంది. 2023లో నర్సులు సమ్మె చేశారు. సిబ్బంది కొరతతో వారు తీవ్రంగా బాధపడుతున్నారు అని కమ్యూనిటీ కార్యకర్త లిండ్సేబ్లోయాన్ మీడియాకు తెలిపారు.
మెరుగైన పని పరిస్థితులు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



