Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భగీరథ నీళ్లు రావాలి, మద్యం అమ్మకాల బెల్ట్ షాపులు బంద్ కావాలి

భగీరథ నీళ్లు రావాలి, మద్యం అమ్మకాల బెల్ట్ షాపులు బంద్ కావాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ గ్రామసభ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది. ఈ గ్రామసభలో గ్రామ ప్రజలు పలు ముఖ్యమైన సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీళ్లు రావాలి. మద్యం అమ్మకాల బెల్ట్ షాపులు పూర్తిగా నిషేధించాలి అనే దానిపై పట్టుబడుతూ గ్రామస్తులు తీర్మానించారు. మధ్య నిషేధం తీర్మానం కాపీలను పోలీస్ శాఖకు రెవిన్యూ శాఖకు ఎక్సైజ్ శాఖకు అందజేస్తానని గ్రామ కార్యదర్శి ప్రజలకు తెలియజేశారు. గ్రామసభకు పలు శాఖల అధికారులు గైరాజార్ కావడంతో గ్రామసభ అగ్రహం వ్యక్తం చేసింది. గ్రామసభ కు పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -