Wednesday, March 11, 2026
E-PAPER
Homeఆటలుప్రి క్వార్టర్స్‌కు బాంబ్రీ జోడీ

ప్రి క్వార్టర్స్‌కు బాంబ్రీ జోడీ

- Advertisement -

ఇండియానా వెల్స్‌ టెన్నిస్‌ టోర్నీ
న్యూయార్క్‌:
ఇండియానా వెల్స్‌ టెన్నిస్‌ టోర్నీ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి యుకీ బాంబ్రీ జంట ప్రవేశించింది. స్వీడన్‌ ఆటగాడు ఆండ్రీ గోరెన్సన్‌తో జతకట్టిన బాంబ్రీ.. మంగళవారం జరిగిన రెండోరౌండ్‌ మ్యాచ్‌లో వరుససెట్లలో ఫ్రాన్స్‌ జంటను ఓడించారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బాంబ్రీ జంట 6-1, 6-3తో వరుససెట్లలో ప్రత్యర్ధి జంటను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ఫ్రాన్స్‌ జంట 6 అనవసర తప్పిదాలు చేయడం కూడా బాంబ్రీ-గోరెన్సన్‌ జోడీకి కలిసిరాగా.. ఈ మ్యాచ సుమారు 66 నిమిషాలసేపు సాగింది. 23వ ర్యాంక్‌తో ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత్‌-స్వీడన్‌ జంట ప్రి క్వార్టర్స్‌లో సండెర్‌ అరెన్స్‌-జిరి లెహెక్రాలతో తలపడనున్నారు. ఈ జంటకు తొలిరౌండ్‌ 2వ సీడ్‌ జంట వైదొలగడంతో వాకౌవర్‌ లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -