Tuesday, April 14, 2026
E-PAPER
Homeసినిమావిజువల్‌ ట్రీట్‌గా 'భరత వర్ష'

విజువల్‌ ట్రీట్‌గా ‘భరత వర్ష’

- Advertisement -

హీరో గోపీచంద్‌, దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి కాంబోలో ఓ చారిత్రక యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో, పవన్‌ కుమార్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌, గోపీచంద్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ ద్వారా సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు.
క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్‌, శూల భూమిలో ప్రారంభమై, అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలతో కట్టి పడేసింది. భారీ యుద్ధ సన్ని వేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధుల క్లోజప్‌లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేసే విజువల్‌ ఫీస్ట్‌ని అందించాయి. భరత భూమికి (భారతదేశానికి) ప్రతీకగా నిలిచే ‘భరత వర్ష’ టైటిల్‌ రివీల్‌ కావడం పవర్‌ఫుల్‌గా ఉంది.
ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, గత యుగాన్ని ఎంతో నైపుణ్యంతో పునర్నిర్మించిన తీరు అద్భుతంగా వుంది. దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తన విజన్‌ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ, భారత చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని గొప్పగా ఆవిష్కరించారు. భారీ స్థాయి, భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్‌ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తున్న ఈచిత్రానికి దర్శకత్వం: సంకల్ప్‌ రెడ్డి, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, సినిమాటోగ్రాఫర్‌: సౌందర్‌ రాజన్‌, ఎడిటర్‌: చోటా కె ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: చిన్న.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -