Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హస్తం చేతిలోకి భీంగల్ మున్సిపాలిటీ

హస్తం చేతిలోకి భీంగల్ మున్సిపాలిటీ

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
ఉత్కంఠభరితంగా సాగిన భీమ్​గల్​ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. మొత్తం 12 వార్డులకు గాను 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించగా, మిగిలిన 4 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

గెలిచిన కౌన్సిలర్లు..
ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి శ్రీజ, రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పర్స కుశలత, మూడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోట సతీష్, నాలుగో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గున్నాల బాల లక్ష్మి, ఐదో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బొదిరే లావణ్య, ఆరో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొదిరే నాగమణి, ఏడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అంజుమ్ అలీ, ఎనిమిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మమ్మరి సందీప్, 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నీలం రవి, పదోవార్డు కాంగ్రెస్ అభ్యర్థి సంటి లత, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సంఘ్యా నాయక్, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లెల అనుపమ గెలుపొందారు.

కౌంటింగ్​ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్​ పరిసరాల్లో పహారాగా ఉన్నారు. అలాగే గుర్తింపు కార్డులు (ఎలక్షన్ ఎంట్రీ పాస్) ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్​ కేంద్రంలోకి అనుమతించారు. కాంగ్రెస్​ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -