Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌కు భెల్‌ భారీ ఆర్డర్‌

పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌కు భెల్‌ భారీ ఆర్డర్‌

- Advertisement -

రూ.2,500 కోట్ల కాంట్రాక్టు
నవతెలంగాణ – హైదరాబాద్‌
విద్యుత్‌, మౌలిక వసతుల రంగంలోని పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (పీఎంపీఎల్‌) తాజాగా భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) నుంచి భారీ ఆర్డర్‌ను సాధించినట్లు వెల్లడించింది. మంచిర్యాల్‌ సమీపంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం భెల్‌ నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) ఆర్డర్‌ను సొంతం చేసుకున్నట్లు ఆసంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో కోల్‌, బయోమాస్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌, యాష్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌, యుటిలిటీస్‌, ఇండ్యూస్డ్‌ డ్రాఫ్ట్‌ కూలింగ్‌ టవర్‌ (ఐడీసీటీ), వాటర్‌, వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌, సంబంధిత సివిల్‌, స్ట్రక్చరల్‌ పనులు, ఎలక్ట్రికల్‌, కంట్రోల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వంటి పనులు ఉన్నాయి.

”ఈ భారీ ఆర్డర్‌ మా ఆర్డర్‌ బుక్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది మా కంపెనీ ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ సామర్థ్యాలను మరింత బలపరుస్తుంది. మా వ్యూహాత్మక వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. అదే విధంగా నమ్మకమైన థర్మల్‌ పవర్‌ ద్వారా దేశ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, దీర్ఘకాలిక ఇంధన భద్రతను నిర్ధారించడం వంటి దేశవ్యాప్త లక్ష్యాలతో ఈ ప్రాజెక్ట్‌ సమన్వయం కలిగి ఉంటుంది.” అని పీఎంపీఎల్‌ సీఎండీ సజ్జా కిశోర్‌ బాబు తెలిపారు. ఈ ఆర్డర్‌ పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు ఒక మైలురాయిగా నిలువడంతో పాటుగా దేశ మౌలిక వసతుల రంగంలో కీలక పాత్ర పోషించనుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -