- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలంలోని నాయిన వాని కుంటలోశుక్రవారం కాంగ్రెస్ జిల్లా నాయకులు కూన్ రెడ్డి రాఘవ రెడ్డి,జిల్లా యువజన నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి,ఇందిరమ్మ ఇండ్లకు పంచాయతీ కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ఇండ్లు కట్టుకోలేని స్తోమత లేని గ్రామీణ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పథకం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మేకల సత్యనారాయణ,చీమట పాపయ్య, గ్రామంలోని లబ్ధిదారుల స్థలములలో ఇల్ల నిర్మాణానికి గాను ముగ్గులు పోయించిన వారిలో ఉన్నారు.
- Advertisement -