Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద ఎక్లారలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ

పెద్ద ఎక్లారలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా లో 11 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నూతన నిర్మాణాలకు మార్కౌట్లు వేసి గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు మద్నూర్ సింగల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు నాయకత్వంలో అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాలకు మార్కౌట్లు భూమి పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇడ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -