Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ-మెండోర
మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో  భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నూత్ పల్లి శ్రీనివాస్ గౌండ్ల శ్రీనివాస్, అంగోల్ల సాయన్న ఇండ్లకు ముగ్గులు పోసి నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు.

అర్హులు ఎవరైనా ఇండ్లు మంజూరు కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులు అయిన ప్రతీ ఒక్కరికీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, సెక్రటరీ బోజేందర్, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -