మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ గతేడాది అత్యధిక ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల హదయాలను గెలుచుకున్న ఈ చిత్రం తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లోనూ సత్తా చాటింది.
నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది. కొత్త తరహా కథాకథనాలు, అద్భుతమైన సాంకేతికతతో ఈ చిత్రం మలయాళ సినీప్రపంచంలో కొత్త మైలురాయిని సష్టించింది.
55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధార్థ్ భరతన్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా రోనెక్స్ జేవియర్ అవార్డులు గెలుపొందారు.
నిర్మాతలు రామచంద్ర చక్రవర్తి (నైట్ షిఫ్ట్ స్టూడియోస్), ఎస్. శశికాంత్ (వైనాట్ స్టూడియోస్) తమ సినిమా సజనాత్మక దష్టిని గుర్తించినందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ, విమర్శకులు, మీడియా, ప్రేక్షకులకు హదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు.
‘ఈ అవార్డులు ప్రయోగాత్మక కథలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి, కేరళ సినిమాకు కొత్త దారులు చూపే ప్రయత్నాలను కొనసాగించడానికి ఇవి మాకు ప్రేరణగా నిలుస్తాయి. మా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బందం, ప్రేక్షకులందరికీ హదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించారు.
అవార్డులోనూ సత్తా చాటిన ‘భ్రమయుగం’
- Advertisement -
- Advertisement -



