నవతెలంగాణ – మద్నూర్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ లచ్చన్ గ్రామాల్లో రెవిన్యూ సదస్సులను అధికారులు నిర్వహించారు. సుల్తాన్ పేట్ గ్రామంలో మండల తహసిల్దార్ ఎండి.ముజీబ్ లచ్చన్ గ్రామంలో ఆర్ ఐ శంకర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు జరిగాయి. భూ సమస్యల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని, అధికారులు సూచించడంతో ఆయా గ్రామాల్లో భూ సమస్యల వ్యవసాయదారులు భారీగా దరఖాస్తులు అందజేశారు. సుల్తాన్ పెట్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి సంజయ్ అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులకు వ్యవసాయదారులకు సౌకర్యాలు కల్పించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం సుల్తాన్ పేట్ ఎంపిటిసి కుటుంబ సభ్యులు దావూద్ పటేల్ రైతులకు సహకరిస్తూ సమస్యల పరిష్కారానికి తాసిల్దార్ కు విన్నవించారు.
భూభారతికి దరఖాస్తుల తాకిడి..
- Advertisement -
- Advertisement -



