Saturday, April 18, 2026
E-PAPER
Homeక్రైమ్ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్‌ సీఐ

ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్‌ సీఐ

- Advertisement -

కల్లు దుకాణం షిఫ్ట్‌ చేయడానికి రూ.3లక్షలు డిమాండ్‌
రూ.2లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
నవతెలంగాణ- బిచ్కుంద

కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద బిచ్కుంద ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణ రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని కల్లు దుకాణ నిర్వాహకుడికి దుకాణం షిఫ్ట్‌ చేయడానికి బిచ్కుంద ఎక్సైజ్‌ సీఐ సత్య నారాయణ రూ.3 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు రూ.2లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం బిచ్కుంద పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణకు బాధితుడు రెండు లక్షల రూపాయలు అందజేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రూ.2లక్షలతో పాటు ఎక్సైజ్‌ సీఐ బ్యాగులో దొరికిన రూ.45,760 స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌లోని ఎక్సైజ్‌ సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.12 లక్షలు లభించాయని.. వాటిని సీజ్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, తదితర విషయాలను సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి శనివారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -