– కాళేశ్వరం నిర్మాణంపై ఎన్డీఎస్‌ఏ నివేదిక చెప్పిందదే
– బీఆర్‌ఎస్ నిర్లక్ష్యమే దెబ్బతీసింది : మంత్రి ఉత్తమ్ విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశ చరిత్రలోనే మానవ కట్టడాల్లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత అతిపెద్ద తప్పిదం కాళేశ్వరం నిర్మాణానిదేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రెండ్రోజుల క్రితం వచ్చిన ఎన్డీఎస్‌ఏ నివేదిక అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దేశంలోనేగాక ప్రపంచంలోనే సాగునీటి ప్రాజెక్టులపై కనీస ప్రమాణాలు పాటించలేదని నివేదికలో ఉందని వ్యాఖ్యానించారు. రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ నేతల నిర్లక్ష్యమే కాళేశ్వరాన్ని దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ జి అనిల్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్‌ఏ నివేదికపై పవర్‌పా యింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో లోపాలు ఉన్నట్టు ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ నేతలు సిగ్గుపడటం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘ఎన్డీఎస్‌ఏ ఎవరు..? నివేదిక ఇవ్వడానికి ‘ అని కించపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఎక్కువ కమీషన్లు వస్తాయని గత ప్రభుత్వ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును కనీసం భూసార పరీక్షలు చేయకుండా, సాంకేతిక అంశాలను పట్టించుకోకుం డానే నిర్మించారని ఆరోపించారు. లంచాల కోసం ప్రాజెక్టు అంచనాలను పెంచుకుంటూ పోయారని చెప్పారు. రూ. 80 వేల కోట్లకు అనుమతులు తీసుకుంటే, ఇప్పటికే రూ. లక్ష కోట్లు దాటిపో యిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కార్పొ రేషన్ల పేర తెచ్చిన అప్పులకు ఏడాదికి రూ.16 వేల కోట్లు వడ్డీ కడుతున్నామని వివరిం చారు. ‘ఆయా పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణా లు తీసుకున్నారు.. అధిక శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలు తెచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రా జెక్టు నిర్మించారు. వాళ్ల హయాంలోనే కూలి పోయింది. ఎన్డీఎస్‌ఏ అనేది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది. చట్టం చేసినప్పుడు బీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతిచ్చారు. బ్యారేజీల భద్రతను పర్యవేక్షించేది ఎన్డీఎస్‌ఏ అత్యున్నత బోర్డే. దేశంలోని 700 బ్యారేజీల భద్రతను పరిశీలిస్తు న్నది. ఆయా అంశాల్లో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఈ బోర్డు ఏర్పాటైంది’ అని అన్నారు. తుమ్మిడిహెట్టి కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడమే ప్రధాన లోపమని ఎన్డీఎస్‌ఏ చెప్పిందని వ్యాఖ్యానించారు. ‘ మేడిగడ్డ ప్రతిపాద నను సీడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చింది. బ్యారేజీ పూర్తయిన తొలి ఏడాదిలోనే లోపాలు బయటపడ్డాయి. లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్పినా సర్వే పట్టించుకోకపోవడంతో నష్టతీవ్రత పెరిగింది. మేడిగడ్డ నిర్మాణంలో లోపాలపై బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బ్యారేజీ లోపలిభాగంలో నీళ్లు భూమి లోకి పోయి బ్యారేజీ వెలుపలకు వస్తున్నాయి. బ్యారేజీ నిర్మాణానికి కనీసం భూసార పరీక్షలు, నాణ్యత పరీక్షలు చేయలేదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ ఉందని ఎన్డీఎస్‌ఏ నివేదిక చెబుతున్నది. నిర్మాణం ప్రారంభించిన ఆరు నెలల తర్వాత సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపించారు. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చవద్దని కేసీఆర్ ఏర్పాటు చేసిన ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లతో నిపుణుల బృందమే చెప్పింది. సీడబ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్‌లో కూడా తర్వాత ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. డీపీఆర్ కు విరుద్ధంగా కేసీఆర్ ఎలా చెప్తే అలా నిర్మిం చేశారు. బీఆర్‌ఎస్ నేతల నిర్లక్ష్యం, కక్కుర్తి, అవినీతి వల్ల ప్రాజెక్టు పనికిరాకుండా పోయింది’ అని ఉత్తమ్ విమర్శించారు డీపీఆర్ ప్రకారం కాకుండా అన్నారం 2.2 కి.మీ, సుందిళ్ల 5.4 కి.మీ దూరం లో నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామ్ భద్రత నిబంధనలను పాటించలేదని తెలిపారు. ఎక్కువ వడ్డీకి షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని చెప్పారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం డిజైన్లు మార్చేశారని ఆరోపించారు. కాళేశ్వరంతో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు నష్టం జరిగిందని వివరించారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీరు లేదనడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యా నించారు. చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉంద న్నారు. వాళ్ల హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కట్టారనీ, వాళ్ల హయాంలోనే కూలిపోయిందని విమర్శించారు. ప్రాజెక్టు కట్టినప్పుడు, కూలిన ప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉందనీ, కేసీఆర్ సీఎం అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని క్యాబి నెట్‌లో చర్చిస్తామనీ, దేశంలోని చట్టాల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
దేశచరిత్రలోనే అతిపెద్ద తప్పిదం
- Advertisement -
RELATED ARTICLES