Magazines

ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ స్కూటర్లు విడుదల చేసిన ఏప్రిలియా

2 గంటల క్రితం

APRILIA INDIA UNVEILS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: ఏప్రిలియా సంస్థ ప్రీమియం స్కూటర్ల విభాగంలోకి 'ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125', 'ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175' మోడళ్లతో కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ శ్రేణిని తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పియాజియో వెహికల్స్ వీటిని ఆవిష్కరించింది. తెలంగాణలో ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 ధర రూ.1,10,374గా, ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175 ధర రూ.1,30,374గా నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లు BS-VI, E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ కూల్డ్ ఇంజిన్లతో వస్తున్నాయి. 175 సీసీ వేరియంట్‌లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఉండగా, 125 సీసీ మోడల్‌లో 5 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఆరు విభిన్న రంగుల్లో లభించే ఈ స్కూటర్ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఏప్రిలియా డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్