నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానసరస్వతి ఆలయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే సండ్రను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు మోరంపూడి ప్రభాకర్, భీమిరెడ్డి గోపాల్ రెడ్డి, పర్వతనేని వేణు, గుర్రం సురేష్, నాయుడు శ్రీను పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)