Magazines

మొట్టమొదటి VWe ట్రాక్ డేలో సందడి చేసిన ఫోక్స్‌వ్యాగన్ పెర్ఫార్మెన్స్ కమ్యూనిటీ

2 గంటల క్రితం

Volkswagen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, కోయంబత్తూరులోని కోస్ట్‌టి (CoASTT) రేస్‌ట్రాక్‌లో తమ మొట్టమొదటి VWe (ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్‌పీరియన్సెస్) ట్రాక్ డేను అట్టహాసంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా గోల్ఫ్ జిటిఐ, వర్టస్ జిటి, టైగన్ జిటి, పోలో జిటి వంటి పెర్ఫార్మెన్స్ వాహన యజమానులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో, ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్లు కేవలం ఒక్క రోజులోనే పూర్తయ్యాయి.

రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రొఫెషనల్ రేస్‌ట్రాక్ వాతావరణంలో తమ వాహనాల పూర్తి సామర్థ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, తోటి డ్రైవింగ్ ఔత్సాహికులతో మమేకమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల నుంచి వచ్చిన అభిమానులు దీనిని విభిన్న ప్రాంతాల సముదాయాల వేడుకగా మార్చారు. తమ GT వారసత్వానికి లభించిన ఈ అద్భుత స్పందన పట్ల ఫోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ యజమానులకు మరిన్ని ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవాలను అందిస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్