Magazines

ఈవీ వాహనదారులకు హెచ్చరిక: బ్యాటరీ, ఛార్జింగ్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి అవసరం

1 గంట క్రితం

Emerging Vehicle Risks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం అత్యంత వేగంగా పెరుగుతుండటంతో, ఈవీ యజమానులు తమ వాహన బీమా పరిధిని సమీక్షించుకోవాలని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పిలుపునిచ్చింది. వాహన్ రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుండి సెప్టెంబర్ వరకు దేశంలో 25.37 లక్షల ఈవీలు రిజిస్టరయ్యాయి. ఇది గత ఏడాది ఇదే వ్యవధితో (16.70 లక్షలు) పోలిస్తే 51.9 శాతం పెరుగుదలను సూచిస్తోంది. 2025 మొత్తం మీద నమోదైన 23.56 లక్షల రిజిస్ట్రేషన్లను 2026లోని మొదటి తొమ్మిది నెలల్లోనే అధిగమించడం విశేషం. మొత్తం కొత్త వాహన రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా 10.7 శాతానికి పెరగ్గా, ఒక్క సెప్టెంబర్‌లోనే 76.1 శాతం వృద్ధితో 3,37,240 ఈవీలు నమోదయ్యాయి. ఇదే వేగం కొనసాగితే 2026 చివరి నాటికి మొత్తం ఈవీ రిజిస్ట్రేషన్లు 33.8 లక్షలకు చేరవచ్చని అంచనా.

సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల రిస్క్ ప్రొఫైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈవీలలో బ్యాటరీ అత్యంత విలువైన భాగం కావడం, ప్రత్యేక మరమ్మతు అవసరాలు ఉండటం మరియు ఛార్జింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో బీమా అవసరాలు మారాయి. ఈ నేపథ్యంలో ఈవీ యజమానులు బ్యాటరీ నష్టాలకు కవరేజీ, ఛార్జింగ్ పరికరాల రక్షణ, ఎలక్ట్రిక్ సర్జ్ సెక్యూర్ కవర్, బ్యాటరీ కన్వీనియన్స్ కవర్ మరియు వాల్ ఛార్జర్ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోవాలని టాటా ఏఐజీ మోటార్ అండర్‌రైటింగ్ హెడ్ ఎ. కిరణ్ కుమార్ సూచించారు. అలాగే పాలసీ మినహాయింపులు, డిడక్టబుల్స్ మరియు క్లెయిమ్ నిబంధనలపై స్పష్టత కలిగి ఉండటం అవసరమని తెలిపారు. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు మరియు కమర్షియల్ ఫ్లీట్ వాహనాల వినియోగం పెరిగినందున వ్యాపార సంస్థలు కూడా నిరంతర నిర్వహణను దృష్టిలో ఉంచుకుని తగిన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్