చంద్రశేఖరన్ కొనసాగింపునకు మద్దతు
న్యూఢిల్లీ : టాటా సన్స్‌పై కుటుంబ ఆధిపత్యం కోసం నోయల్ టాటా ప్రయత్నిస్తున్నారని సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ జిమ్మీ టాటా ఆరోపించారు. ట్రస్టుల్లో కుటుంబ సభ్యుల ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నాలు వ్యవస్థాపకుల ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. డిసెంబర్లో పదవీకాలం ముగియనున్న వేణు శ్రీనివాసన్ స్థానంలో నోయల్ కుమారుడిని నియమించడాన్ని వ్యతిరేకించారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ కొనసాగింపునకు తాను, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ట్రస్టుల ద్వారా టాటా సన్స్‌పై నియంత్రణ సాధించేందుకు నోయల్ ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో 2013-14లో చేసిన సవరణల ద్వారా లభించిన వీటో అధికారాలను ఉపయోగించి, బోర్డులో 4-1 మెజారిటీ ఉన్నప్పటికీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కొనసాగింపును, ఆర్బిఐ నిబంధనల ప్రకారం సంస్థ లిస్టింగ్‌ను నోయల్ అడ్డుకుంటున్నారని జిమ్మీ టాటా ఆరోపించారు. అప్పుల్లో ఉన్న సంస్థలను లాభాల బాట పట్టించి రికార్డు స్థాయిలో డివిడెండ్లు అందించిన చంద్రశేఖరన్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.






కామెంట్లు (0)