Magazines

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో
 అగ్నిప్రమాదం

17 నిమిషాల క్రితం

Fire incident at
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

6వ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉన్న 
బోగీలో ఎగిసిపడిన మంటలు

నవతెలంగాణ-నాచారం

​​మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెయింటెనెన్స్ పనుల కోసం నిలిపి ఉంచిన ఖాళీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల్లోకెళ్తే.. రైల్వేస్టేషన్‌‌లోని 6వ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలు బోగీలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రైల్వే పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. చర్లపల్లి అగ్నిమాపక అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైల్వే పోలీసులు, అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రాణనష్టం కూడా జరగలేదని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అగ్నిప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్