Magazines

‌పాడి కౌశిక్‌‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

10 నిమిషాల క్రితం

Setback for Padi Kaushik Reddy in High Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

రెండు పిటిషన్లు కొట్టివేత

వాయిస్‌ శాంపిల్‌ 
సేకరణకు గ్రీన్‌‌సిగ్నల్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వాయిస్‌ శాంపిల్స్‌ సేకరించేందుకు గ్రీన్‌‌సిగ్నల్‌ ‌ఇచ్చింది. కింది కోర్టు ఇచ్చిన అనుమతిని సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టేసింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో సీఐడీ అధికారులు ఎమ్మెల్యే వాయిస్‌ శాంపిల్స్‌ సేకరించేందుకు అవకాశం లభించింది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులతో కౌశిక్‌రెడ్డికి వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వీణవంక, హుజూరాబాద్‌ పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. అనంతరం వాటి దర్యాప్తును సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. ఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డుల్లోని గొంతును కౌశిక్‌రెడ్డి స్వరంతో పోల్చేందుకు శాంపిల్స్‌ అవసరమని భావించిన సీఐడీ, మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించింది. వాయిస్‌ శాంపిల్స్‌ సేకరణకు అనుమతిస్తూ జూన్‌ 25న కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని రద్దు చేయాలని ఎమ్మెల్యే కౌశిక్‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్