Magazines

పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో సీగ్రామ్స్ ఎక్స్‌క్లామేట్!ఆన్‌ను ప్రారంభించింది

4 గంటల క్రితం

Bottle-NBR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పెర్నోడ్ రికార్డ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌లో సీగ్రామ్స్ ఎక్స్‌క్లామేట్!ఆన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గత 30 ఏళ్లలో కంపెనీ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆవిష్కరణ ఇది. సీగ్రామ్స్ ఎక్స్‌క్లామేట్!ఆన్ భారతదేశానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ పోర్ట్‌ఫోలియో. ఇది విస్కీ, వోడ్కా, జిన్, రమ్ మరియు బ్రాందీ అనే ఐదు విభిన్న స్పిరిట్ కేటగిరీలను కలిగి ఉంది. ఇవన్నీ ఒకే ప్రీమియం బ్లెండెడ్ శ్రేణిలో ఒకే ధరకే అందించబడతాయి.భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న యువ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ బ్రాండ్ ఎంట్రీ-స్థాయి ప్రీమియం ధరల శ్రేణిలో వ్యూహాత్మకంగా గణనీయమైన స్థానంలో ఉంచబడింది. ఇందు కోసం లక్ష్యంగా 26-30 సంవత్సరాల వినియోగదారులు ఎంచుకోబడ్డారు. ఈ వినియోగదారులు సులభంగా  అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు మరియు విలక్షణమైన ఉత్పత్తి వైపు ఆకర్షితులవుతారు. వీరు శక్తివంతమైన సామాజిక సమూహాలుగా  కలుస్తారు  మరియు మహిళలు, మగవారు కలిసి సమావేశమైనప్పుడు ప్రతి ఒక్కరికి పానియాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అది జిన్, వోడ్కా, రమ్ మరియు బ్రాండీ వంటి విస్కీని మించిన శ్రేణుల్లో అభివృద్ధిని వివరిస్తుంది.

ప్రతి ఏడాది చట్టబద్ధంగా మద్యం సేవించే వయస్సులోకి 20 మిలియన్స్ కి పైగా వినియోగదారులు ప్రవేశిస్తుండటంతో,  అందుబాటులో ఉండే ప్రీమియం ధరలకి నాణ్యతతో కూడిన ఆల్కహాల్ కోసం  డిమాండ్ ఉన్న మార్కెట్ ఆవశ్యకతను Xclamat!on పరిష్కరించింది.  బ్రాండ్ యొక్క "ఇది Xclamat!on సమయం" ప్రతిపాదన,  భారతదేశంలోని ఆధునిక తరం వినియోగదారుల కోసం సాధారణ క్షణాలను అసాధారణ అనుభవాలుగా మార్చే ఒక ఉత్ప్రేరకంగా దీనిని నిలబెడుతుంది.

జీన్ టోబౌల్, CEO, పెర్నాడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు, " మూడు దశాబ్దాలకు పైగా, పెర్నాడ్ రికార్డ్ ఇండియా దేశంలో ప్రీమియం స్పిరిట్స్ పరిశ్రమను తీర్చిదిద్దడంలో ముందు వరుసలో ఉంది. Xclamat!on బ్రాండ్ వినియోగదారుల లోతైన అభిప్రాయాల నుండి ఉత్పన్నమైంది, మరియు ఆడ, మగ కలిసే సామాజిక సమావేశాల కోసం ప్రీమియం నాణ్యత మరియు రకాలు రెండిటిని కోరుకునే ఆధునిక తరానికి చెందిన భారతదేశపు వినియోగదారుల కోసం రూపొందించబడింది. Xclamat!on ఒకే బాటిల్ లో  ఉన్న సాహసం, ఆవిష్కరణ మరియు సంబరం. దీని విడుదల మా మొదటి ఏకీకృత బ్రాండ్ ను ప్రీమియం మిశ్రమ విభాగంలో  ఐదు స్పిరిట్స్ శ్రేణులు- విస్కీ, వోడ్కా, జిన్, రమ్ మరియు బ్రాందీలలో విస్తరించింది- ఇది వచ్చే దశాబ్దంలో పరిశ్రమ వృద్ధిని అధిగమిస్తుంది. Xclamat!on కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక అసాధారణమైన రుచి కోసం అంతర్జాతీయ విజ్ఞానంతో రూపొందించబడిన ఉత్తమమైన భారతదేశపు స్పిరిట్స్ యొక్క మిశ్రమం."

Xclamat!on యొక్క " అసాధారణమైన రుచి కోసం రూపొందించబడిన  ప్రపంచం " BTL సిద్ధాంతం అనేది అత్యంత అనుకూలమైన ధరల పాయింట్ లో అసాధారణమైన రుచిని అందచేసే శ్రేణిపై ఆధారపడింది. ఈ ఏకీకృత బ్రాండ్ అయిదు శ్రేణుల్లో విస్తరించింది, ప్రతిది విలక్షణమైన డిజైన్, రుచి మరియు స్థానంతో సాటిలేని విలువను అందచేయడానికి రూపొందించబడింది.  ఈ విస్కీ, డ్యూయల్ కాస్క్ లలో  పరిణితి చెందిన  స్పీసైడ్ స్కాచ్ మాల్ట్స్ లతో తయారు చేయబడి, మృదువైన అనుభూతిని అందించడానికి భారతదేశపు గ్రెయిన్ స్పిరిట్స్ తో మిశ్రమం చేయబడింది. బ్రాందీ భారతదేశపు మరియు ఫ్రెంచ్ ద్రాక్ష యొక్క పరిపూర్ణమైన మిశ్రమాన్ని వర్ణిస్తుంది, ఉత్తమమైన రుచిని ఇవ్వడానికి ఫ్రెంచ్ లిమోసిన్ కాస్క్ లో పరిపక్వం చేయబడింది.  ఈ రమ్ భారతదేశపు బెల్లం రమ్ మరియు పాతపడిన జమైకా స్పిరిట్స్ యొక్క విలక్షణమైన మిశ్రమం.  దీనికి ఘాటైన రుచిని అందించడానికి దీనిని రాగి, స్టీల్ కుండల్లో తయారు చేస్తారు.  వోడ్కా సాటిలేని స్వచ్ఛతను ఇవ్వడానికి  భారతదేశపు సహజమైన వాతావరణంలో ఒక విలక్షణమైన లయ. రష్యా యొక్క మూన్ స్టోన్ టెక్నాలజీతో సన్నని ప్రవాహంతో ఫిల్టర్ చేయబడుతుంది. జర్మనీ నుండి వచ్చిన జునిపర్ బెర్రీస్ యొక్క సహజమైన రుచులను భారతదేశంలో ఉన్న మిశ్రమ వృక్షాలతో కలిపి
7 విభిన్నమైన రుచులను ఇవ్వడానికి జిన్ అభివృద్ధి చేయబడుతుంది.


Xclamat!on  బ్రాండ్ కంటే ఎక్కువే; ఇది సాహసం, ఆవిష్కరణ, మరియు సంబరాలు యొక్క స్టేట్మెంట్. దీని యొక్క సాహసోపేతమైన “!” చిహ్నం ఆకారం డిజైన్ ఎంపిక కంటే ఎక్కువే; ఇది మానసికమైన ప్రేరణ- “!”చిహ్నాన్ని ఎదుర్కొన్నప్పుడు మనుష్యులు ఆగుతారు మరియు రెండుసార్లు చూస్తారు, రద్దీగా ఉండే రిటైల్ వాతావరణాల్లో  అందరూ ఆగి చూసే సాటేలిని శక్తిని ఇదే Xclamat!onకి ఇస్తోంది. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్