నవతెలంగాణ-హైదరాబాద్ : సీగ్రామ్కు చెందిన రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తన పండుగ ప్రచార కార్యక్రమం “ఈ పండుగ సీజన్లో, ప్రతి ఒక్కరిలోని ప్రత్యేకతను ఘనంగా వేడుక చేసుకుందాం” ను ప్రారంభించింది. ప్రతి వేడుకను ప్రత్యేకంగా మార్చేలా, అందులో ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటారు. అందరినీ ఒకచోట చేర్చే స్నేహితుడు, డ్యాన్స్ ఫ్లోర్‌పై సందడిని ప్రారంభించే బంధువు, తన చమత్కారాలతో అందరినీ నవ్వించే సహోద్యోగి... ఇలా ప్రతి వేడుకలో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపే వ్యక్తులే ఆ వేడుకలను చిరస్మరణీయంగా మారుస్తారు. వారి ప్రత్యేకత, వారు తీసుకొచ్చే ఉత్సాహమే ప్రతి కలయికను మధుర జ్ఞాపకంగా నిలుపుతుంది. ఈ ప్రచార ఆలోచనను క్రికెటర్ రోహిత్ శర్మ, నటుడు, హాస్యనటుడు రాహుల్ దువా, నటి మాన్వి గగ్రూ నటించిన థీమ్ ఫిల్మ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ ఫిల్మ్ ప్రస్తుతం బ్రాండ్‌కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్ రాయల్స్టాగ్లైవ్ఇట్లార్జ్ లో అందుబాటులో ఉంది.
ఈ ప్రచారంలో ప్రధాన ఆకర్షణ ఏఐ ఆధారిత ప్రత్యేక కార్యక్రమం. దీని ద్వారా వినియోగదారులు తమ ఆత్మీయుల్లోని ప్రత్యేకతను వేడుకగా జరుపుకునే అవకాశం కల్పించారు. రాయల్స్టాగ్లైవ్ఇట్లార్జ్.కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా, వినియోగదారులు రోహిత్ శర్మతో పాటు తమను కూడా చూపించే వ్యక్తిగతీకరించిన పండుగ వీడియో సందేశాన్ని రూపొందించి, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.
పెర్నోడ్ రికార్డ్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దేబశ్రీ దాస్‌గుప్తా మాట్లాడుతూ, “వేడుకలు ఎంత ఘనంగా జరిగాయనే దానికంటే, వాటిని ప్రత్యేకంగా మార్చిన వ్యక్తుల వల్లే అవి మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. #సెలబ్రేట్లార్జ్ అనే ఆలోచనతో రాయల్ స్టాగ్ ఎన్నో ఏళ్లుగా భారతీయులకు స్ఫూర్తినిస్తోంది. ఈ పండుగ సీజన్లో, ఆ ఆలోచనకు మరింత వ్యక్తిగతమైన రూపాన్ని అందిస్తున్నాం. ఎందుకంటే, కొన్నిసార్లు గొప్ప వేడుకలు అంటే మరొకరికి అసాధారణమైన అనుభూతిని కలిగించే చిన్న చిన్న ఆప్యాయతలే. జనరేటివ్ ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా, సృజనాత్మకతను ప్రతి ఒక్కరి చేతుల్లోకి తీసుకువస్తున్నాం. తద్వారా ప్రజలు తమ ఆత్మీయుల పట్ల తమకంటూ ప్రత్యేకమైన రీతిలో అభిమానాన్ని, ప్రేమను వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తున్నాం. ఇది సంస్కృతి, సృజనాత్మకత, సాంకేతికతల మధ్య ఆసక్తికరమైన సమ్మేళనం. అంతేకాకుండా, ఏఐ యొక్క అత్యంత శక్తివంతమైన వినియోగం ఏదైనా అసాధారణమైనదాన్ని సృష్టించడం కాకపోవచ్చు; మనిషిలోని లోతైన భావాలను వ్యక్తపరచడంలో సహాయపడటమే కావచ్చని ఇది గుర్తుచేస్తోంది” అని అన్నారు.
డెంట్సు క్రియేటివ్ వెబ్చట్నీ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ అభిజీత్ రే మాట్లాడుతూ, “ప్రతి పండుగ సీజన్లో మనం లెక్కలేనన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కానీ, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మనకు ఎందుకు ప్రత్యేకమో వారికి ఎన్నిసార్లు చెబుతాం? ఈ ఆలోచనే రాయల్ స్టాగ్ పండుగ ప్రచార కార్యక్రమం ‘ప్రతి ఒక్కరిలోని ప్రత్యేకతను వేడుక చేసుకుందాం’ కు స్ఫూర్తినిచ్చింది. ప్రతి వ్యక్తి తనదైన ప్రత్యేకమైన అలవాట్లు, చేష్టలు, వ్యక్తిత్వంతో ఒక వేడుకకు ప్రత్యేకతను, చిరస్మరణీయతను ఎలా తీసుకువస్తారో ఈ ప్రచారం తెలియజేస్తుంది. ఈ మానవీయ ఆలోచనకు జనరేటివ్ ఏఐ సాంకేతికతను జోడించి, రోహిత్ శర్మ కనిపించే వ్యక్తిగతీకరించిన పండుగ శుభాకాంక్షల సందేశాల ద్వారా ప్రజలు తమ అభిమానాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరిచేలా ఒక ప్రత్యేక అవకాశాన్ని సృష్టించాం. ఈ ఆలోచనకు కార్యరూపం తీసుకురావడంలో రాయల్ స్టాగ్ బృందంతో కలిసి పనిచేయడం డెంట్సుకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రజలు తమ పండుగ శుభాకాంక్షలను మరింత వ్యక్తిగతంగా, ఆత్మీయంగా తెలియజేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రింట్ మీడియా, అవుట్ ఆఫ్ హోమ్ మీడియా ద్వారా అందుబాటులో ఉంది. బ్రాండ్‌కు సంబంధించిన వివిధ ప్రచార ప్రదేశాల్లోని క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వినియోగదారులు రోహిత్ శర్మతో కూడిన తమ వ్యక్తిగతీకరించిన శుభాకాంక్షల సందేశాలను రూపొందించుకోవచ్చు.







కామెంట్లు (0)