Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసభ ముందుకు వీవీపీ రద్దు, నియామకాల క్రమబద్దీకరణ బిల్లు

సభ ముందుకు వీవీపీ రద్దు, నియామకాల క్రమబద్దీకరణ బిల్లు

- Advertisement -

మూడువాయిదా తీర్మానాల తిరస్కణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ చట్టం-1986 రద్దు, అనుబంధ అంశాల చేర్పునకు సంబంధించిన బిల్లును శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన హేతుబద్ధ చట్టం- 1994 సవరణకు సంబంధించిన బిల్లును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశ పెట్టారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, నిరుద్యోగభృతి-జాబ్‌క్యాలెండర్‌ అంశాలపై బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత టి.హరీశ్‌రావు, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పాల్వాయి హరీశ్‌బాబు, వేర్వేరుగా ఇచ్చిన మూడు వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 2018-19 వార్షిక నివేదికను సభ ముందుంచారు. అనంతరం సభను ఉదయం 11గంటల55 నిమిషాలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద ్‌కుమార్‌ 15 నిమిషాలు టీ బ్రేక్‌ అంటూ విరామం ప్రకటించారు. తిరిగి సభ మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాలకు ప్రారంభమైంది.

దుకాణాల్లో పనిచేసేవారికి కార్పొరేషన్‌ పెట్టండి : డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌
నగరాలు, పట్టణాల్లోని కిరాణం, సెల్‌, బట్టలషాపులు, తదితర దుకాణాల్లో పనిచేసేవారికి సామాజిక, ఆర్థిక రక్షణ చర్యలు లేవనీ, వారు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ సభ్యులు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ శాసనసభలో సోమవారం లేవనెత్తారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, తదితర సామాజిక పథకాల వర్తింపు, కనీస వేతనాల వర్తింపు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవిం చారు. గిగ్‌ వర్కర్ల సంక్షేమంపై కాంగ్రెస్‌ సభ్యులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అడిగారు. సంజరు సూచనను పరిగణనలోకి తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. గిగ్‌, ప్లాట్‌ఫారం వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తెలిపారు. గిగ్‌, ఫ్లాట్‌ఫారం వర్కర్ల కోసం పథకాలను రూపొందించడానికి 2020, సామాజిక భద్రతా స్మృతి నిబంధనలు వీలు కల్పిస్తున్నదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -