Saturday, September 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఇంటర్ విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు ప్రారంభం..

ఇంటర్ విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు ప్రారంభం..

- Advertisement -

హాజరు తీరును పరిశీలించిన డీఐఈఓ గణేష్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌ

ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేస్తున్నారు. అయితే, 20 రోజులుగా కేంద్ర ప్రభుత్వ యుడాయి సంస్థతో ఒప్పందం ముగియడంతో నెట్వర్క్ సమస్యలు, బ్యాటరీ లోపాలు వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని అధిగమించేందుకు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ముఖ గుర్తింపు సాంకేతికత (ఎస్ఆర్ఎస్ఏ)ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థ హాజరు నమోదులో కచ్చితత్వాన్ని, సమయపాలనను నిర్ధారిస్తుందని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే శనివారం జిల్లాలో ఫేస్ రికగ్నిషన్ సిస్టం అమలును జిల్లా ఇంటర్ విద్యాధికారి జాధవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. పట్టణంలోని ప్ర‌భుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హాజరు తీసుకునే విధానాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కలశాలకు హాజరు కావాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -