Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీర్కూర్ సొసైటీ మహాజన సభ రసాభస 

బీర్కూర్ సొసైటీ మహాజన సభ రసాభస 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మహాజన సభ సమావేశం సోమవారం బీర్కూర్ సహకార సంఘం గోదాంలో నిర్వహించారు. ఈ మహాజన సభ సమావేశం రసాభాసగా కొనసాగింది. ఈ మహాజన సభాసమావేశం సంఘ అధ్యక్షులు రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి విఠల్ 1-4-25 నుండి 25- 09- 25 వరకు అయిన జమ,ఖర్చులను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి సొసైటీ వార్షిక నివేదికను చదువుతుండగా కొంతమంది సభ్యులు అడ్డు తగిలారు. సొసైటీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సొసైటీ కి సంబంధించిన ఇన్ కమ్ టాక్స్ డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో, ఇన్ కమ్ టాక్స్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు, జరిమానా విధించడం జరిగిందన్నారు.

రూ.6,5000 కట్టవలసింది, మూడు లక్షల 15000 కట్టడం జరిగిందని కొందరు రైతులు ఆరోపించారు. దీనికి కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ గత 5 సంవత్సర ఇన్ కమ్ టాక్స్ ను ఒకే సారి చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో కోర్టు సంప్రదించి డబ్బులను కట్టవలసి వచ్చింది అన్నారు, ఇన్ కమ్ టాక్స్ డబ్బులను కట్టడంతో సొసైటీకి కొంత లాభం జరిగిందన్నారు. విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని, సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. నిర్లక్ష్యం చేసిన కార్యదర్శి పై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు అలగే సొసైటీ పరిధిలో చాలామందికి రుణమాఫీ కాలేదని అందుకు బాద్యులు ఎవరని ఎందుకు రుణమాఫీ కాలేదని రైతులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -