Saturday, February 7, 2026
E-PAPER
Homeబీజినెస్బిట్‌ కాయిన్‌ 12 శాతం పతనం

బిట్‌ కాయిన్‌ 12 శాతం పతనం

- Advertisement -

వాషింగ్టన్‌ : క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ విలువ భారీగా పతనమవుతోంది. శుక్రవారం ఒకేరోజు 12 శాతానికి పైగా పతనమై 63,295 డాలర్లకు పరిమితమయ్యింది. 2024 అక్టోబర్‌ తర్వాత ఒకరోజు అత్యధికంగా క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒక దశలో 60వేల డాలర్లకు కూడా పడిపోయింది. విలువైన లోహాలలో అస్థిరత, ఐటి షేర్లలో భారీ అమ్మకాలు ఈ పరిస్థితికి కారణమైంది. దాంతో దాదాపు 1 బిలియన్‌ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ పొజిషన్లను మదుపర్లు వదిలించుకున్నారని క్రిప్టో కరెన్సీ యాప్‌ కాయిన్‌గ్లాస్‌ డేటా వెల్లడించింది. గ్లోబల్‌ క్రిప్టో మార్కెట్‌ గడిచిన ఒక్క నెలలోనే లక్ష కోట్ల డాలర్లు క్షీణించింది. 2025 అక్టోబర్‌ తర్వాత రూ.2 లక్షల కోట్లు డాలర్లు విలువ హరించుకుపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -