Wednesday, February 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ అభ్యర్థి మృతి

బీజేపీ అభ్యర్థి మృతి

- Advertisement -

మక్తల్‌ మున్సిపాలిటీ
ఆరో వార్డు ఎన్నిక రద్దు
నవతెలంగాణ -మక్తల్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాల్టీ ఆరో వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి శివయ్య ప్రకటించారు. మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్‌ అధికారి ఉత్తర్వులు విడుదల చేశారు.

ఆత్మహత్యపై సమగ్ర విచారణ : మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి
మక్తల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్య సంఘటనపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇతరులపై ఒత్తిడి తేవడం, బెదిరింపులకు పాల్పడే చర్యలకు పాల్పడదని అన్నారు మంగళవారం మక్తల్‌లో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తనకు ఒకరిని బెదిరించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని చెప్పారు. విలేకరుల సమావేశంలో బికేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, జి.రవికుమార్‌ యాదవ్‌,కోళ్ళ వెంకటేష్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు, ఎంపీ డీకే అరుణ
ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యపై అతని భార్య స్టేట్మెంట్‌ ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. పోలీసులు రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌ను మార్చాలని అప్పటివరకు పోస్ట్‌ మార్టం జరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయాలి తప్ప ముఖ్యమంత్రి, మంత్రి చెప్పిన విధంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లా పనిచేయవద్దని అన్నారు. మంగళవారం ఆయన పార్లమెంటు సభ్యులు డికె. అరుణతో కలిసి మక్తల్‌ ప్రభుత్వాస్పత్రిలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలన్నారు. తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన స్థానిక సిఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయాలన్నారు. 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు రామచందర్‌ రావు ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గువ్వల బాలరాజ్‌, రవీందర్‌ రెడ్డి, నాగురావు, నామాజీ, కొండయ్య, కొత్త కాపు రతంగపాడురెడ్డి, శంకరోళ్త రవికుమార్‌, స్థానిక నాయకులు ఎం.భాస్కర్‌, జి.బలరాం రెడ్డి, బి.రాజశేఖర్‌ రెడ్డి, కర్ని స్వామి డాక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, కుర్వ హనుమంతు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -