ఆయిల్ ఫామ్స్ పై అవగాహణ పెంచుకొని వాటిని సాగు చేసేందుకు ముందుకు రావాలి: శాస్త్రవేత్త, ఎం సాయి చరణ్
నవతెలంగాణ – దర్పల్లి
రైతు సోదరులు ఎప్పటికప్పుడు పంటమార్పిడిపై అవగాహణ చేస్తూ లాభందయకంగా పంటలను సాగుచేసుకొని లాభలను అర్జీంచవచ్చని శాస్త్రవేత్త ఎం. సాయి చరణ్ అన్నారు. సోమవారం మండల కేంద్రములోని పబచాయతీ కార్యాలయంలో రైతులకు పంటలపై శాస్త్రవేతల అవగాహనం కార్యక్రమము నిర్వహిబచారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ రైతులు పంటలను మార్పిడి చేస్తూ లాభాలు అర్జీంచాలని అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేతల ద్వారా చూచనలు అందించడం జరుగుతుందని అన్నారు. రైతులు తమ పంటలకు పిచకరి చేసే తప్పుడు చేతులు శుభ్రం చేసుకున్నాకే తిను బండారాలను తీసుకోవాలని అన్నారు. అజగ్రత్తగా పిచికారీ చేసే సమయంలో ఆదమర్చి టీలు, స్నాక్స్, భోజనం, నీరు తదితర ఆహార పదర్తలను తీసుకోకూడదని అన్నారు.
ఇలా చేస్తే ప్రాణంతక వ్యాధులు మనకు తెలియకుండా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలాగే పిచికారీ చేస్తున్న సమయంలో పొలం గట్లపై ఇతరులు చూడకూడదు గలితో వాటి ప్రభావం వారిపై పడే అవకాశం ఉందని అన్నారు. పిచికారీ చేసే విక్తి పూటిగా తన దేహాన్ని కప్పుకొని పిచికారీ చెయ్యాలని కోరారు. అలాగే యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సాధించుకోవాలని కోరారు. సేంద్రియ ఎరువుల తో పంటల దిగుబడి అధికంగా వస్తుందని అన్నారు. అధికారుల సూచనలు సలహాలు పాటిస్తే మంచి దిగుబడితోపాటు ప్రభుత్వం ద్వారా అందించే బోనస్ కు అర్హులు అవుతారని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్స్ పై అవగానా పెంచుకొని వాటి సాగుకు ముందుకు రావాలని కోరారు. అలాగే రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పని సరి చె్యువకోవాలని కోరారు. కొందరు రైతులు రిజిస్ట్రేషన్ పక్రియకు ఒక నెంబర్, రైతు బందుకు ఒక నంబర్ ఇలా ప్రతి పథకానికి ఒక నంబర్ ఇస్తున్నారు ఆలా కాకుండా అన్నిటికి ఒకే నంబర్ లింక్ చేపించినట్లయితే పనులు కూడా త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు.
అలాగే వరి పంటలో నిత్యం నీరు నిల్వ ఉంచకూడదని, అడప దడప నీటిని నిల్వఉండకుండా చూడాలని అన్నారు. దింతో నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారవుతారని తెలిపారు.కార్యక్రమములో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, గ్రామములోని ఫార్తిలెజర్ షాపుల యజమానులు, రైతులు గడ్డం గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, నల్ల సంతోష్, రైతు సోదరులు మండల వ్యవసాయ అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు.



