- Advertisement -
నవతెలంగాణ – తాండూరు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూసఫ్ గూడా రెహ్మాత్ నగర్ లో వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ ని ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణా లో రాబోయే ప్రభుత్వం బీజేపీ దే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కర్ణం ప్రహ్లాద రావు, మాజీ జిల్లా అధ్యక్షులు అంజనకుమార్ గౌడ్,మాధవరెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేశ్ కుమార్,జిల్లా నాయకులు పాండుగౌడ్, కృష్ణ ముదిరాజ్,విజయభాస్కర్ రెడ్డి,భద్రశ్వర్, బొప్పి శ్రీహరి పాల్గొన్నారు.
- Advertisement -



