– సామాజిక సేవతో మహనీయులను స్మరించుకుందాం
– ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ – కామారెడ్డి
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) సంయుక్త సహకారంతో జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే మొదటి 200 మంది రక్తదాతలకు హెల్మెట్లు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహనీయుల జయంతులను స్ఫూర్తిదాయకంగా మార్చేందుకు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి అంబేద్కర్‌కు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, రక్తదాన కార్యక్రమ కోఆర్డినేటర్ బాలు, ప్రధాన కార్యదర్శి సంగయ్య, కోశాధికారి శ్రీనివాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజయ్య, కార్యదర్శి వంశీ, బిచ్కుంద మండల అధ్యక్షులు ఎంకొల్ల రాజన్న, సాయి మౌర్య, డి. రాజయ్య, మన్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



