Tuesday, November 25, 2025
E-PAPER
Homeజాతీయంరక్తమోడిన రహదారులు

రక్తమోడిన రహదారులు

- Advertisement -

తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదాలు- 12 మంది మృతి
చెన్నై:
తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రయివేట్‌ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢకొీనడంతో ఏడుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్లో చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధురై నుంచి సెన్‌కొట్టారు వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు దురైసామిపురం ప్రాంతానికి రాగానే, ఎదురుగా తెన్‌కాశీ నుంచి వస్తోన్న మరో బస్సును బలంగా ఢకొీట్టింది. స్పాట్‌లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మరణించగా, మరోకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం ధాటికి రెండు బస్సులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం తెన్‌కాశీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెన్‌కాశి జిల్లా కలెక్టర్‌ కమల్‌ కిశోర్‌, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ అరవింద్‌ నేతృత్వంలోని పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సును ప్రమాద స్థలం నుంచి తొలగించే పనులు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

నియంత్రణ కోల్పోయి గుంతలో పడిన బస్సు: ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని తెహ్రా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి గుంటలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారని ఏఎస్పీ జేఆర్‌ జోషి తెహ్రీ గర్వాల్‌ తెలిపారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 28 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు సోమవారం రిషికేశ్‌ నుంచి కుంజాపురి ఆలయానికి చేరుకుంది. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సు 70 మీటర్ల లోతు ఉన్న గుంటలో పడిపోయినట్టు సమాచారం. ఘటనాస్థలిలో ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యల్లో నిమగమ య్యాయి. కాగా ప్రయాణి కులంతా ఢిల్లీ, గుజరాత్‌కు చెందినవారుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -