రక్తమోడిన రోడ్లు

– వేగంగా వచ్చి పుల్లర్‌ లారీని ఢకొీన్న కారు
– నలుగురు అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ-డిచ్‌పల్లి
జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ముందు వెళ్తున్న ట్రాలా లారీని వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢకొనగా.. కారులో ఉన్న నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని చంద్రయాన్‌పల్లి శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. డిచ్‌పల్లి సీఐ మోహన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని కొండల్‌ వాడికి చెందిన నిరడి గణేష్‌ (28), ఆయన సోదరుడు నిరడి ఆదిత్య (25) అదే గ్రామానికి చెందిన మరో స్నేహితుడు ప్రకాష్‌ (28) కొంతకాలంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. నిరడి గణేష్‌ జిల్లా కేంద్రంలో మొబైల్‌ షాప్‌ నిర్వహిస్తున్నారు. దుకాణానికి కావాల్సిన సామగ్రి కోసం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన సాయిరాం (27)తో కలిసి నలుగురు యువకులు ఆదివారం కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్‌పల్లి 44వ జాతీయ రహదారిపై కారు ముందు వెళ్తున్న భారీ మల్టీ ఎక్స్‌ఎల్‌ పుల్లర్‌ లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢకొీట్టింది. వేగం తీవ్రతకు కారులో ఉన్న నలుగురూ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్‌ ఏసీపీ కిరణ్‌ కుమార్‌, సీఐ మోహన్‌, డిచ్‌పల్లి ఎస్‌ఐ కచకాల గణేష్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృత దేహాలను టోల్‌ ప్లాజా సిబ్బంది సాయంతో వెలికి తీసి పోస్ట్‌మార్టంకు తరలిం చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీ లారీని రహదారిపై నడిపి నలు గురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడు గణేష్‌ తండ్రి నిరడి హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

 

Spread the love