– దేశంలో వెలిగిపోతున్నది ఆ నలుగురే
– ప్రజలపై విపరీత భారాలు..కార్పొరేట్లకు రాయితీలు
– బీజేపీ ప్రభుత్వ విధానాలపై క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యమాలు
– మోడీ కార్మిక, రైతు వ్యతిరేకి
– ఇందిరా పార్కు వద్ద ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాపడావ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంటున్నది గదా..దమ్ముంటే దేశ సంపదపై ప్రజలందరికీ సమాన హక్కు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దేశంలో నేడు కేవలం నలుగు వ్యక్తులు మాత్రమే వెలిగిపోతున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు పెంచుతూ, పన్నుల పేరుతో కేంద్ర పాలకులు భారాలు మోపుతూ ప్రజల బతుకులను కేంద్ర పాలకులు చిదిమేస్తున్నారనీ, అదే సమయంలో కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామనీ, దేశాన్ని కాపాడుకుంటామని ప్రతినబూనారు. కేంద్ర కార్మిక, రైతు సంఘాల సంయుక్త పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాపడావ్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, ఐఎన్‌టీయూసీ ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగన్న గౌడ్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారన్న, హెచ్‌ఎమ్‌ఎస్ ఆలిండియా కార్యదర్శి సుదర్శన్‌రావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌కే బోస్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.జనార్ధన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్, రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్, తెలంగాణ రైతు కూలి సంఘం కార్యదర్శి ఎం.భిక్షపతి, తదితరులు మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. బ్రిటీష్‌పాలకులపైనా, స్వతంత్య్రం వచ్చాక మన పాలకులపైనా పోరాడి, కొట్లాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడానికి మోడీ ఎవరు? అని ప్రశ్నించారు. బ్రిటీష్ పాలకుల కంటే దుర్మార్గంగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు సాధించి గద్దెనెక్కడంపైనే బీజేపీ దృష్టి ఉందని ఆరోపించారు. మోడీ పచ్చి ఫాసిస్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హక్కుల గురించి, పాలకుల విధానాల గురించి ప్రశ్నించే మేధావులు, రచయితలు, కార్మిక, రైతు ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. బ్రిటీష్‌పాలకులపైనా, స్వతంత్య్రం వచ్చాక మన పాలకులపైనా పోరాడి, కొట్లాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడానికి మోడీ ఎవరు? అని ప్రశ్నించారు. బ్రిటీష్ పాలకుల కంటే దుర్మార్గంగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు సాధించి గద్దెనెక్కడంపైనే బీజేపీ దృష్టి ఉందని ఆరోపించారు. మోడీ పచ్చి ఫాసిస్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హక్కుల గురించి, పాలకుల విధానాల గురించి ప్రశ్నించే మేధావులు, రచయితలు, కార్మిక, రైతు సంఘాల నేతలు, ప్రజాస్వామికవాదులను ఉపా చట్టం కింద నిర్బంధించి వారు జైల్లోనే మగ్గేలా చేస్తున్న మోడీ సర్కారు తీరును ఎండగట్టారు. వలస కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల వివరాలు కేంద్రం వద్ద లేవనటం దుర్మార్గమన్నారు. దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నదనీ, అది యువతను పెడదోవ పట్టిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశభక్తి ముసుగేసుకున్న మోడీ సర్కారు కార్పొరేట్లకు దేశాన్ని అమ్మేస్తున్నదని విమర్శించారు. దేశ రక్షణకు సంబంధించిన డిఫెన్స్ రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఎలా అవకాశం ఇస్తారని నిలదీశారు. ఢిల్లీ రైతాంగ పోరాటం విరమణ సందర్భంగా మోడీ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ సర్కారును గద్దె దింపాలంటే ఐక్యపోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మహాపడావ్‌లో ఆర్‌డీ చంద్రశేఖర్(ఐఎన్‌టీయూసీ), జె.వెంకటేశ్, ఎం.వెంకటేశ్ (సీఐటీయూ), ఎం.నర్సింహ్మ(ఏఐటీయూసీ), ఎం.శ్రీనివాస్ (ఐఎఫ్‌టీయూ), రెబ్బా రామారావు(హెచ్‌ఎంఎస్), వి.ప్రవీణ్(ఐఎఫ్‌టీయూ), అనురాధ(ఐఎఫ్‌టీయూ), వి.వి.రత్నాకర్‌రావు(టీఎన్‌టీయూసీ), ఆంజనేయులు (ఏఐయూటీయూసీ), కార్మిక సంఘాల నాయకులు బి.వెంకటేశ్, అజరుబాబు, మల్లేశ్‌యాదవ్, ఏ.నాగేశ్వర్‌రావు(మెడికల్ రిప్స్), పావని, సునీత, తదితరులు పాల్గొన్నారు.