Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏడుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బీఎల్‌ఆర్‌ చేయూత

ఏడుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బీఎల్‌ఆర్‌ చేయూత

- Advertisement -

చెక్కులు పంపిణీ చేసిన మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఏడుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) చారిటబుల్‌ ట్రస్ట్‌ చేయూతనందించింది. మంగళవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో ఆ ఏడుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఆయన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు చెక్కులను అందించడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగిందని చెప్పారు. ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్యత్‌ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని వివరించారు.

వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో ”వైట్‌ కోట్‌ విప్లవం” సాకారమైందని చెప్పారు. దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి, ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌ ముదిరాజ్‌, మహేష్‌ గౌడ్‌, ప్రవీణ్‌, నాగరాజు, బోసాని పవన్‌ కుమార్‌, దయాకర్‌ రెడ్డి, శ్రవణ్‌, రఘువరన్‌, నాని, రాజేష్‌ గౌడ్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -