Tuesday, March 3, 2026
E-PAPER
Homeమానవిబొబ్బర్లు.. బోలెడు లాభాలు…

బొబ్బర్లు.. బోలెడు లాభాలు…

- Advertisement -

ఈవెనింగ్‌ స్నాక్స్‌ అంటే పీజా, బర్గర్‌, పునుగులు, బజ్జీలు, ఇవే గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే. కానీ మన పెద్దవాళ్ల కాలంలో చాలా శక్తివంతమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు. సాయంత్రం తినే స్నాక్స్‌ కూడా అలానే ఉండేవి. వాటిలో బొబ్బర్లు ఒకటి. బొబ్బర్లలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఉడకబెట్టిన బొబ్బర్లు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు. మరి బొబ్బర్లు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొబ్బర్లను.. అలసందలు అని కూడా పిలుస్తారు. వీటిలో ప్రోటీన్‌, ఫైబర్‌, విటమిన్‌ ఎ,సి,కె, బి కాంప్లెక్స్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్‌, మాంగనీస్‌, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తాయి. బొబ్బర్లలో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల.. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో అజీర్తి, అసిడిటీ, గ్యాస్‌, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు బొబ్బర్లు బరువు తగ్గడంలో కూడా అద్భుతంగా సహాయపడతాయి. వెయిట్‌ తగ్గాలనుకునేవారు బొబ్బర్లను డైట్‌లో చేర్చుకుంటే మంచింది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా బొబ్బర్లు సహాయపడతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగించి గుండె ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది.

బొబ్బర్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి నాన్‌వెజ్‌ తినలేని వారికి బొబ్బర్లను మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది కండరాలకు శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. శారీరక శ్రమ, ఎక్కువ వ్యాయామం చేసే వారికి బొబ్బర్లు శక్తిని అందిస్తాయి. ఒక కప్పు బొబ్బర్లలో ఏకంగా 13 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. బొబ్బర్లలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. పైగా వీటిలో ఉండే ఫైబర్‌ షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేస్తుంది. బొబ్బర్లలో విటమిన్‌ బి9 ఎక్కువగా లభిస్తుంది. ఇది గర్భిణీలకు ఔషధం లాంటిది. వీటిని తరుచుగా తినడం వల్ల గర్భంలో శిశువు ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి క్యాన్సర్‌ ప్రమాదాన్ని కూడా దూరం చేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -