- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని పలివెల గ్రామ కార్యదర్శిగా బొడ్డు పెళ్లి శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి గ్రామంలోని ప్రజాప్రతినిధులు , గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రామ కార్యదర్శి బొడ్డు పెళ్లి శ్రీనివాస్ కు ఉప సర్పంచ్ చెరుకు సునీత సైదులు , వార్డు సభ్యులు ఆనగంటి కృష్ణ బత్తుల ప్రవీణ్ గోసుకొండ మల్లేష్ నాయకులు కొండూరి మల్లికార్జున్ ఘనంగా సన్మానం చేశారు.
- Advertisement -



