Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం 

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం 

- Advertisement -

నవతెలంగాణ – (నందిపేట,) ఆర్మూర్ 
మండలంలోని తల్వేద గ్రామ శివారులోని వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం కలకలం రేపింది. వాగులో మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాని వాగులో నుంచి బయటకు తీయించారు. మృతి చెందిన మహిళా వయస్సు సుమారు 40 నుండి 45 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తుంది. మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళా మృతదేహాన్ని ఎవరికైనా తెలిస్తే నందిపేట్ పోలీసులకు సంప్రదించాలని గుర్తు తెలియని మృతదేహం గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్ రాజ్  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -