Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు...

హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకువెళ్లి సురక్షితంగా ల్యాండ్ చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయ అధికారులకు శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్లు రాసి ఉందని తెలిపారు. 1984లో మద్రాస్ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని, ఎల్‌టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్రణాళిక వేశాయని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు పైలట్‌కు సమాచారం అందించారు. విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -