Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వైభవంగా బోనాల పండుగ 

వైభవంగా బోనాల పండుగ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని ఉప్పెరగూడెం గ్రామంలో బోనాల పండుగను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనంతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు బోనం, మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని అమ్మవార్లకు నైవేద్యం చెల్లించి మొక్కుకున్నారు. గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని.. పశు, పక్షాదులు, పిల్లా పాపలు సల్లంగా చూడాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. బోనాల సందర్భంగా డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img