- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం గ్రామ ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. భాజా భజంత్రీలతో బేడల వారీగా బోనాలు, నైవేద్యాలు గ్రామదేవతలకు సమర్పించారు. తల్లీ పిల్లా.. చల్లగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు. పంటలు బాగా పండేలా, వర్షాలు పడి పాడి పంటలు పండాలని కోరుకున్నారు. గ్రామదేవతలు ప్రజల కష్టాల్లో తోడుగా ఉండాలని పూజించారు.
- Advertisement -